కోడిపందెం
DEVADAS
Monday, January 16, 2012
Friday, November 25, 2011
వలలో కేవీపీ వియ్యంకుడు
పిలిచి ప్రశ్నించిన సీబీఐ అధికారులు
గజం 5 వేలకే కొన్నానంటూ వాదన
ఐటీ సోదాల్లో 110 కోట్ల 'బ్లాక్ మనీ' పట్టివేత
అల్లిబిల్లి కంపెనీల ద్వారా ధన ప్రవాహం
సహ నిందితుడిగా చేర్చే అవకాశం!

ఎమ్మార్ బౌల్డర్ హిల్స్‌లో విల్లా! లేదా... ప్లాటు! అదో స్టేటస్ సింబల్. సినీ, రాజకీయ, వాణిజ్య ప్రముఖులకు మినహా ఇతరులకు అక్కడ 'ప్రవేశం లేదు'. కోట్లకు పడగలెత్తిన వారు సైతం... 'మాకో ప్లాటు ఇప్పించండి' అంటూ భారీ స్థాయిలో పైరవీలు నడిచిన కాలం! అలాంటిది... ఒకే ఒక వ్యక్తికి ఒక విల్లా, నాలుగు ప్లాట్లు దక్కాయి. అడ్వాన్సు కూడా చెల్లించకుండానే విల్లా బుక్కయిపోయింది. ఇంత ఘనత దక్కింది ఎవరికో కాదు! ఆయన పేరు రఘు రామ కృష్ణంరాజు. ఆయన... వైఎస్ హయాంలో చక్రం తిప్పిన కేవీపీకి స్వయానా వియ్యంకుడు. ఇప్పుడు ఎమ్మార్ అక్రమాల కేసులో రఘురాజు అడ్డంగా ఇరుక్కున్నారు. ఆయనను సహ నిందితుడిగా కూడా చేర్చే అవకాశం కనిపిస్తోంది. ఆయనను మనీ లాండరింగ్ వివాదం కూడా చుట్టుముడుతోంది.
హైదరాబాద్: బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టులో రఘురాజు, ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో ఒక విల్లా, నాలుగు ప్లాట్లు ఉన్నాయి. ఆయన నుంచి ఎలాంటి అడ్వాన్స్ తీసుకోకుండానే 1487 చదరపు గజాల విల్లాను (ఏ727) కేటాయించారు. తర్వాత 2005లో 1262 చదరపు గజాలు, 2009 అక్టోబర్‌లో 1485, 2010 ఫిబ్రవరిలో 1870, ఆ తర్వాతి నెలలోనే 1416 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ప్లాట్లు 'కొన్నారు'. ఈ వ్యవహారం అత్యంత నాటకీయంగా బయటపడింది. కొన్ని రోజుల క్రితం ఆదాయపు పన్ను శాఖ అధికారులు రఘు రాజు నివాసంలో సోదాలు నిర్వహించారు.
ఏకంగా 30 కోట్ల రూపాయల లావాదేవీలకు లెక్క తేలలేదు. అధికారులు దీనిని బ్లాక్ మనీగా గుర్తించడంతో... ఈ వ్యవహారాన్ని మరింత తవ్వి తీయకుండా ఉండేందుకు అప్పటికప్పుడు రూ.30 కోట్లకు పన్ను కట్టేందుకు రఘు రాజు అంగీకరించారు. ఈ సమయంలో స్వాధీనం చేసుకున్న రికార్డులను, ఇతర వివరాలను పరిశీలించిన అనంతరం... 'ఇంకా ఏదో ఉంది' అనే అనుమానంతో ఐటీ అధికారులు మరోసారి రఘురాజు నివాసంపై దాడులు చేశారు. ఈసారి ఏకంగా 80 కోట్ల రూపాయల బ్లాక్ మనీ వివరాలు బయటపడ్డాయి. అంతేకాదు... మరిన్ని ఆసక్తికర సంగతులూ వెలుగు చూశాయి.
వైఎస్ జగన్ సంస్థల్లో కోల్‌కతాకు చెందిన అల్లిబిల్లి కంపెనీలు పెట్టుబడులు పెట్టినట్లే... రఘు రాజు కంపెనీల్లోకి కూడా డబ్బులు ప్రవహించినట్లు గుర్తించారు. రఘురాజు కుమార్తె ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులకు ప్రయత్నించినప్పటికీ... ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో ఆగిపోయినట్లు సమాచారం. రఘు రాజు వద్ద ఏకంగా రూ.110 కోట్ల బ్లాక్ మనీ వివరాలు బయటపడటం, ఆయనకు ఎమ్మార్‌లో విల్లా, నాలుగు ప్లాట్లు ఉన్నట్లు తెలియడంతో దీనిపై సీబీఐ అధికారులు దృష్టి సారించారు. రఘు రాజును పిలిచి ప్రశ్నించారు. సీబీఐ అధికారుల ప్రశ్నలకు ఆయన మహా పెడసరంగా సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. 'నేను చదరపు గజం ఐదు వేలకే కొన్నాను. బ్లాక్‌లో ఏమీ ఇవ్వలేదు' అని చెప్పినట్లు సమాచారం.
'అన్ని ప్లాట్లు ఎలా వచ్చాయి? కేవీపీ బంధువు కావడంవల్లే ఇచ్చారా?' అని ప్రశ్నించగా... 'కేవీపీతో సంబంధంలేదు. ప్లాట్లు నన్ను చూసే ఇచ్చారు' అని పేర్కొన్నారు. 'గజం 50 నుంచి 60 వేల రూపాయల ధర ఉన్న బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టులో మీకు గజం ఐదు వేలకే ఎందుకు ఇచ్చారు? బ్లాక్‌లో అదనంగా చెల్లించారా? లేక... గుడ్‌విల్‌గా పొందారా?' అని ప్రశ్నించినా... రఘురాజు 'లేదు. నాకు ఐదువేలకే ఇచ్చారు. బ్లాక్‌లో కట్టలేదు. గుడ్‌విల్ సంగతి తెలియదు. కేవీపీతో సంబంధం లేదు' అనే బదులిచ్చినట్లు తెలిసింది.
నిజానికి... ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో విల్లాలు కొన్న వారిలో సుమారు నలభై మంది తాము అధికారికంగా ఐదు వేల రూపాయలు చెల్లించి.... మిగిలింది బ్లాక్‌లో ఇచ్చినట్లు అంగీకరించారు. అంతేకాదు... ఈ లావాదేవీలు నడిపిన 'స్టైలిష్' రంగారావు కూడా రఘు రాజు నుంచి బ్లాక్‌లో సొమ్ము తీసుకున్నట్లు సీబీఐకి చెప్పినట్లు తెలిసింది. అలాగే... రాజకీయ నాయకులకు మాత్రం 'గుడ్‌విల్'గా చదరపు గజం రూ.5 వేలకే విక్రయించినట్లు ఈ కేసులో నిందితుడు కోనేరు ప్రసాద్ అంగీకరించినట్లు సమాచారం. వీటన్నింటిని బట్టి చూస్తే... రఘు రాజు అబద్ధం చెబుతున్నట్లు సీబీఐ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఆయనను ఎమ్మార్ కేసులో సహనిందితుడిగా చేర్చే అవకాశం కనిపిస్తోంది. జగన్ తరహాలోనే రఘు రాజు కంపెనీల్లోకి కూడా మనీలాండరింగ్ ద్వారా నిధులు వచ్చినట్లు తెలియడంతో సీబీఐ దీనిపైనా దృష్టి సారించింది. విల్లాల అసలు ధర విషయంలో సహకరించకపోవడం, మహా నిర్లక్ష్యంగా, పెడసరంగా సమాధానాలు చెప్పడంతో రఘు రాజు విషయాన్ని సీబీఐ 'సీరియస్'గా తీసుకున్నట్లు తెలిసింది.

Sunday, January 16, 2011
Monday, October 4, 2010
Thursday, September 30, 2010
Thursday, June 17, 2010
Subscribe to:
Comments (Atom)